విద్యార్థులు గల్లంతైన ప్రదేశాన్ని పర్యవేక్షిస్తున్న టి.డీజీపీ
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ప్రదేశానికి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. డీజీపీతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది కూడా ఉన్నారు. వీరికి మండి జిల్లా అడిషనల్ ఎస్పీ సహకరిస్తున్నారు.