బాలికను బెదిరించి ఐదుగురు అత్యాచారం
ఓ బాలిక అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఐదుగురు ఆమెను బెదిరిస్తూ అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అనంతపురం జిల్లా గుత్తిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధిత బాలికకు ఆమె సోదరి పెళ్లిలో మోసెస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేయగా... అతడి స్నేహితులు నలుగురు కూడా బెదిరించి పలుసార్లు అత్యాచారం జరిపారు. గర్భం దాల్చడంతో బాధితురాలితో కలసి తల్లిదండ్రులు మోసెస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.