స్పెయిన్ లో వివాహ వయస్సు పదహారేళ్ళేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పెయిన్ లో వివాహ వయస్సు పదహారేళ్ళేనట!

స్పెయిన్ లో చట్టబద్ధమైన వివాహ వయస్సును 16 ఏళ్ళకు పెంచారు. ఈ మేరకు స్పెయిన్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి అనా మాటో ఓ ప్రకటన చేశారు. ఇంతకుముందు వరకు స్పెయిన్ లో 14 ఏళ్ళకే వివాహం న్యాయసమ్మతంగా ఉండేది. సాధారణంగా స్పెయిన్ వాసులు 18 ఏళ్ళ వరకు పెళ్ళి మాట ఎత్తరట. ఏవో కొన్ని సందర్భాల్లో 14 ఏళ్ళకే ఒక్కటవ్వాల్సి వస్తే న్యాయమూర్తి అనుమతి గానీ, కుటుంబ సభ్యుల అంగీకారం గానీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకే ఈ నూతన చట్టం అని తెలుస్తోంది.

అయినా, స్పెయిన్ లో మైనర్ వివాహాలు తక్కువే. 2010 ప్రథమార్థంలో 17 ఏళ్ళ వయస్సున్న వారు 68 మంది వివాహం చేసుకున్నారట. కాగా, ఇతర యూరోపియన్ దేశాల్లో 'పదహారేళ్ళ వయస్సు' చట్టం అమల్లో ఉంది. తాజాగా స్పెయిన్ కూడా వాటి సరసన చేరినట్టయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్పెయిన్ లో 13 ఏళ్ళ వయస్సుకే పరస్పర ఆమోదయోగ్యమైన శృంగారంలో పాల్గొనవచ్చట. అయితే ఈ వయస్సును పెంచాలని పార్లమెంటులో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

More Telugu News