ప్రియాంకతో పిట్ బుల్ 'ప్రణయం'..!
కొద్దిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ప్రారంభ వేడుకలు గుర్తున్నాయా? కార్యక్రమం ఆఖర్లో స్టేడియంలో సంగీత తరంగాలను ఉప్పొంగించిన అమెరికా ర్యాప్ సునామీ పిట్ బుల్ అందరి మన్ననలు అందుకున్నాడు. తన విలక్షణ గాత్రం, ఆకర్షణీయ హావభావాలతో కోల్ కతా వాసుల మనసు దోచుకున్నాడు. అంతేనా, పనిలోపనిగా బాలీవుడ్ క్యూటీ ప్రియాంక చోప్రాతో ఓ గీతంలో నర్తించేందుకు కాంట్రాక్టునూ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాక్.
ఇంతకుముందు ప్రియాంక 'ఇన్ మై సిటీ' అంటూ ఓ సింగిల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట హిట్టవ్వడంతో, తాజాగా ఈ సుందరి 'ఎక్సోటిక్' పేరిట మరో సింగిల్ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఆ గీతానికి సంబంధించిన వీడియో షూటింగ్ మియామిలో జరుగుతోంది. ఈ గీతంలో 'బర్ఫీ' తారకు పిట్ బుల్ కు మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలుంటాయట. అంటే, మాంచి మసాలా సాంగ్ అన్నమాట. సో.. గెట్ రెడీ బాయ్స్!!.