ఎర్రబుగ్గలు అందరికీ వద్దు: సుప్రీం కోర్టు
ప్రముఖులు తమ కార్లపై ఎర్ర బల్బులు పెట్టుకుని సైరన్ మోగిస్తూ వెళుతుండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న తీరుపై సుప్రీం సీరియస్ గా స్పందించింది. వీటిని అందరూ వాడకుండా నియంత్రించాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకు జూలై రెండో వారం వరకూ గడవు ఇచ్చింది. అభయ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు కొంచెం ఘాటుగానే స్పందించింది.
కేవలం రాజ్యాంగ ఉన్నత పదవులలో ఉన్నవారు, అంబులెన్సులు, ఫైర్, పోలీస్, మిలటరీకి మాత్రమే ఎర్ర బుగ్గలు, సైరన్లు పరిమితం చేయాలని కోర్టు కోరింది. ఇందుకోసం కఠిన చర్యలు తీసుకోవాలని, మోటార్ వాహనాల చట్టంలో సవరణలు తీసుకురావాలని ఆదేశించింది. ప్రజలు ఎర్రలైటంటేనే అసహ్యించుకుంటున్నారని కోర్టు పేర్కొంది.
పోలీసులు సైరన్లను అదే పనిగా వాడుతుంటారని, దీని అవసరమేమిటని ప్రశ్నించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఎర్రలైట్లు, సైరన్లను పరిమితం చేయాలని కోరుతూ.. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.