'ప్రియ' సఖి చేయందుకున్న లక్ష్మీపతి బాలాజీ
తమిళనాడు క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. చెన్నై మోడల్ ప్రియా తాలూర్ తో కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ పేస్ బౌలర్ మూడు ముళ్ళు వేసేందుకు ముచ్చట పడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నయ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన నిశ్చితార్థ కార్యక్రమంలో తన ప్రియ సఖి వేలికి ఉంగరం తొడిగిన బాలాజీ 'ఆరు బంతుల్లో ఆరు వికెట్లు' తీసినంత సంబరపడిపోయాడు.
చెన్నైలో జరిగే ప్రముఖుల పార్టీల్లో తరచూ కనిపించే ప్రియ.. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బాలాజీ జతగా దర్శనమిచ్చేది. ఇటీవలే షారూక్ ఖాన్ తో ఓ పార్టీలో తళుక్కుమన్న ప్రియకు సామాజిక సృహ కూడా ఎక్కువే. అందుకు నిదర్శనంగా, బడుగువర్గాల చిన్నారుల నిధి కోసం నిర్వహించిన ఓ మారథాన్ పరుగులో పాల్గొంది కూడా.
ఈ జంట ఇప్పుడు పెళ్ళకి సిద్ధమవడంతో ప్రియ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోండగా.. మరోవైపు, బాలాజీ కూడా ప్రియ తన అదృష్ట దేవత అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడట. కాగా, అప్పట్లో ఈ జంట తామిద్దరం 'మంచి స్నేహితులం మాత్రమే' అని తప్పించుకోజూసేవారు. ఈ నిశ్చితార్థంతో ఊహాగానాలకు తెరపడింది. సోమవారం రాత్రి ఆ కార్యక్రమం పూర్తయిందో లేదో, ఫేస్ బుక్ లో ఫొటోలు అప్ లోడ్ చేశారీ ప్రేమ పక్షులు.