ఏం పాపం చేశానో... రాజకీయాల్లోకి వచ్చాను: మురళీమనోహర్ జోషి
ఏం పాపం చేశానో రాజకీయాల్లోకి వచ్చానని సీనియర్ బీజేపీ నేత మురళీమనోహర్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్సు విద్యార్థిని అయివుండి రాజకీయాల్లో ఇరుక్కుపోయానన్నారు. భక్తి సంగీతం వినేటప్పుడే తాను ఇంకా మనుషుల మధ్యే ఉన్నానన్న ఆలోచన వస్తోందని అన్నారు.
మురళీమనోహర్ జోషిది వారణాసి నియోజకవర్గం. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని గుజరాత్, యూపీ నుంచి బరిలో దించాలని ఆ పార్టీ భావిస్తోంది. కాగా యూపీలో వారణాసి అయితే బాగుంటుందని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. జోషికి వారణాసిని వదులు కోవడం ఇష్టం లేదు. దీంతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.