ఎన్నికల నేపథ్యంలో పాక్ తాత్కాలిక ప్రధానిగా ఖోసో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల నేపథ్యంలో పాక్ తాత్కాలిక ప్రధానిగా ఖోసో

మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంగా తాత్కాలిక ప్రధానిగా విశ్రాంత న్యాయమూర్తి  మీర్ హజార్ ఖాన్ ఖోసో వ్యవహరించనున్నారు. ఈమేరకు పాక్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. పాక్ లో ఎన్నికలు మే 11న జరగనున్నాయి.

వాస్తవానికి తాత్కాలిక ప్రధానిని.. దేశ ప్రధాని, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత, పార్లమెంటరీ సంఘం ఎంపిక చేయాలి. అయితే చర్చల సందర్భంగా వీరి మధ్య ఏకాభిప్రాయం సాధ్యంకాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని దేశంలో నిజాయతీ పరుడని గుర్తింపు ఉన్న ఖోసో పేరును ప్రకటించింది.  

More Telugu News