జెడ్ కేటగిరీ భద్రతకు అంగీకరించిన కేజ్రీవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జెడ్ కేటగిరీ భద్రతకు అంగీకరించిన కేజ్రీవాల్

తనకు భద్రత వద్దంటూ మొండిపట్టు పట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చివరికి సరేనన్నారు. ఇండియన్ ముజాహిదీన్ నుంచి బెదిరింపులు రావడంతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించారు. దీనికి ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయే ముందే కేజ్రీవాల్ సమ్మతి తెలిపారు. దీంతో ఆయనకు 22 మంది గార్డులతో భద్రత కల్పించారు. 'నాకు దేవుడే రక్ష, నాకెలాంటి భ్రదత అవసరం లేదు' అని కేజ్రీవాల్ అంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కేజ్రీవాల్ ను అపహరించి... సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను విడిపించుకుని వెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

More Telugu News