నేను ఎప్పటికీ మహబూబ్ నగర్ జైపాల్ రెడ్డినే..
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఎప్పటికీ మహబూబ్ నగర్ జైపాల్ రెడ్డినే..

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ తాగునీటి పథకం ద్వారా 109 గ్రామాలకు మంచినీరు అందుతుందని ఆయన వెల్లడించారు. కల్వకుర్తిలో 17 ఏళ్లపాటు సుదీర్ఘ రాజకీయ తపస్సు చేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. 

పాలక పక్షంలో ఉన్నందున తాను తెలంగాణ అంశంపై మాట్లాడలేనన్నారు. తనకు మహబూబ్ నగర్ తో విడదీయరాని సంబంధం ఉందని ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి తెలిపారు. తానెక్కడ గెలిచినా తనను మహబూబ్ నగర్ జైపాల్ రెడ్డే అంటారని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News