తాలిబన్ల బెదిరింపుతో ముషారఫ్ సభకు అనుమతి రద్దు
నాలుగేళ్ల అనంతరం పుట్టిన గడ్డ పాకిస్తాన్ లో ముషారఫ్ కొద్దిసేపటిక్రితం అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రముఖులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అయితే ఈ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించాలన్న ముషారఫ్ ఆకాంక్షకు పాక్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
పాక్ లో ముషారఫ్ అడుగుపెడితే చంపేస్తామంటూ తాలిబన్లు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ ముందస్తు చర్యకు పాల్పడింది. ఫలితంగా ముషారఫ్ మీటింగ్ రద్దయింది.
పాక్ లో ముషారఫ్ అడుగుపెడితే చంపేస్తామంటూ తాలిబన్లు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ ముందస్తు చర్యకు పాల్పడింది. ఫలితంగా ముషారఫ్ మీటింగ్ రద్దయింది.