Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలన్నది కేంద్రం యోచన: సుష్మాస్వరాజ్

విభజన నేపథ్యంలో రాజధాని హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేసి గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇందుకు పార్లమెంటులో సవరణలు, ఓటింగ్ జరగాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయని మండిపడ్డారు. విభజన క్రమంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఏకతాటిపైకి తేవడంలో విఫలమైనట్లు ఎద్దేవా చేశారు.

More Telugu News