ముంబై రైల్వే స్టేషన్లో అనూహ్యతో కలిసి అడుగులేసింది ఎవరు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై రైల్వే స్టేషన్లో అనూహ్యతో కలిసి అడుగులేసింది ఎవరు?

ముంబైలో దారుణహత్యకు గురైన 23 ఏళ్ల తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో కీలక సాక్ష్యం ఒకటి పోలీసులకు లభించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై క్రైం బ్రాంచ్ ఇప్పటి వరకూ నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం మినహా పెద్దగా పురోగతి సాధించలేదు. జనవరి 5న ముంబై రైల్వే స్టేషన్లో అనూహ్య ప్రయాణించిన రైలు మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ లో ఆగింది. దాంతో ఇప్పటి వరకు ఆ ప్లాట్ ఫామ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలకు మాత్రమే పోలీసులు పరిమితం అయ్యారు. తాజాగా వేరే ప్లాట్ ఫామ్ లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించగా అనూహ్యను గుర్తించారు. ఆమె మధ్య వయసుగల వేరొక వ్యక్తితో కలిసి మాట్లాడుతూ ముందుకు సాగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? దీనిపైనే ముంబై పోలీసులు దృష్టి సారించారు.

తల్లిదండ్రులకు ఆ సీసీటీవీ ఫుటేజీలను చూపించగా అందులో ఉన్న వ్యక్తి ఎవరో తమకు తెలియదని బదులిచ్చారు. దీంతో ముంబై క్రైంబ్రాంచ్, రైల్వే పోలీసుల సంయుక్త బృందం విచారణలో భాగంగా హైదరాబాద్ కు చేరుకుంది. మరోవైపు దాదాపు 40 మంది వ్యక్తులను పోలీసులు నిన్న ప్రశ్నించారు. వీరిలో అనూహ్య సహచర ఉద్యోగులు, కంపెనీ ప్రతినిధులు, ఆమెతో కలిసి రైలులో ప్రయాణించిన వారు ఉన్నారు.

More Telugu News