Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేమెందుకు సిగ్గుపడాలి.. ప్రధానే మాతో కూర్చుంటున్నారు: మోదుగుల

'కాంగ్రెస్ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారు.. నేరగాళ్లు, ఆరోపణలు ఉన్నవారే పార్లమెంటులో కూర్చుంటున్నారు.. మా జాతి కోసం ఉద్యమించిన మేమెందుకు సిగ్గుపడాలి?' అని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులో తెలిపిన నిరసనలను తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేసిన దానిపై స్పందింస్తూ ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో మోదుగుల మాట్లాడారు. 'జైలు శిక్ష పడిన సురేష్ కల్మాడీ, బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని మన్మోహన్ సింగ్ మాతోపాటే కూర్చుంటుండగా... తెలుగు జాతి కోసం ఉద్యమించిన మేమెందుకు సిగ్గుపడాలి?' అని ప్రశ్నించారు. శివప్రసాద్ పార్లమెంటులో వేసిన వేషాలు భారతీయతను, భగవద్గీతను గుర్తు చేసేవేనని ఆయనకు మోదుగుల మద్దతు పలికారు.

More Telugu News