న్యూయార్క్ లో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. నలుగురు మృతి
అమెరికాలోని న్యూయార్క్ బ్రాంక్స్ ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కాగా, 63 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరికి స్వల్ప గాయాలవగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రైలులోని ఐదు బోగీలు పట్టాలు తప్పినట్టు న్యూయార్క్ ట్రాన్స్ పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. అయితే, రైలు బోగీలు పట్టాలకు సమీపంలో ఉన్న హడ్సన్ నది ఒడ్డు వరకూ వెళ్లి ఆగిపోయాయని, దాంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రస్తుతం అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.