రాయల తెలంగాణను బీజేపీ ఒప్పుకోదు: విద్యాసాగర్ రావు
రాయల తెలంగాణ ప్రతిపాదనను బీజేపీ అంగీకరించదని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం బీజేపీ పోరాడుతుందని అన్నారు. హైదరాబాద్ ను యూటీ చేయడానికి ఒప్పుకోమని తెలిపారు.