డీఎన్ఏ కార్డు అందుబాటులోకి తేవాలి: గవర్నర్
దేశ ప్రజలకు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఇన్ని కార్డులెందుకు? అని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించారు. ఇన్ని కార్డులకు బదులుగా ఒక డీఎన్ఏ కార్డును అందుబాటులోకి తేవాలన్నారు. సింగిల్ కార్డ్ డేటా మెయింటెన్స్ పై చర్యలు చేపట్టాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరసింహన్ పైవిధంగా మాట్లాడారు.