Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీ పథకాలకు రూ. 50 లక్షల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే వివిధ పథకాలకు చెన్నై వాసులు రూ. 50 లక్షల విరాళం ఇచ్చారు. విరాళాలకు సంబంధించిన డీడీలను దాతలు డిప్యూటీ ఈవో రాజేంద్రునికి సమర్పించారు. దాతలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. నిత్యాన్న ప్రసాదానికి భక్త వత్సలరావు రూ. 10 లక్షలు, బర్డ్ ఆస్పత్రికి గణేష్ కుమార్ రూ. 10 లక్షలు, స్విమ్స్ ఆస్పత్రికి హేమలత రూ. 10 లక్షలు, గో సంరక్షణకు విజయ బాబు రూ. 10 లక్షలు, ప్రాణదానం పథకానికి నాగమల్లీశ్వరి రూ. 10 లక్షలు అందజేశారు.

More Telugu News