టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విభజనపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ వరదబాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి కోరే తాము వచ్చామని, అయినా తమను లోపలకు అనుమతించలేదని వారు ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం పండగ చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.