Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీకి చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రణబ్ టర్కీ, బెల్జియం దేశాధినేతలతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మూడు రోజులపాటు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పర్యటించిన ప్రణబ్ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంపొందించే విషయమై దృష్టి పెట్టారు. అణు సరఫరా గ్రూపులో చోటుకోసం భారత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని టర్కీలో పర్యటన సందర్భంగా కోరారు. ఈ పర్యటనలో ఆయా దేశాల యూనివర్సిటీలకు భారత యూనివర్సిటీలకు మధ్య ఒప్పందాలు కుదిరాయి.

More Telugu News