పదవులే కీలకమంటున్న కొందరు నేతలు: మధుయాష్కీ
రాజకీయాలకు అతీతంగా పని చేస్తే, తెలంగాణ రాజకీయ ఐకాసతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ స్పష్టం చేశారు. తన రాజీనామాతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంటే... ఇక పార్లమెంట్ కు కూడా వెళ్లకుండానే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో 'తెలంగాణ రాష్ట్రం, సామాజిక న్యాయం' అనే అంశంపై తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడుతూ, తెలంగాణ వస్తే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్న నేతలు, ఢిల్లీకి వచ్చాక ముఖ్యమంత్రి పదవితోపాటు, పలు డిమాండ్లు వెల్లడి చేస్తున్నట్లు తెలిపారు. పదవులు, నాయకత్వం కోసం ఎస్సీ, బీసీ అని చెప్పుకొనే నేతలు... పదవులు వచ్చాక ఆయా వర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.