గూగుల్ 'ఇంపాక్ట్ ఛాలెంజ్' పోటీ
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూగుల్ సంస్థ 'ఇంపాక్ట్ ఛాలెంజ్' పోటీలు నిర్వహిస్తోంది. దీని ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. అక్షరాలా 3 కోట్ల రూపాయలు. అయితే, ఇందుకు మీరు చేయాల్సిందేమిటంటే.. దైనందిన జీవితంలో ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంత వరకు ఉపయోగపడుతుందనేది చెప్పాలి. అయితే, మీరు చెప్పాలనుకున్నది ఏదయినా స్వచ్ఛంద సంస్ధ ద్వారా చెప్పాలి. ఆ సంస్థ ద్వారా మీరు రూపొందించిన ప్రాజెక్టు అమలుకు కృషి చేయాలి. ఆ స్వచ్ఛంద సంస్థకు గూగుల్ సంస్థ సాయమందిస్తుందన్నమాట, అదీ అసలు విషయం.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం.. ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ పోటీలను పెట్టి సృజనాత్మకత వెల్లి విరిసే, బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడే మంచి స్వచ్ఛంద సంస్థను గుర్తించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఆ స్వచ్ఛంద సంస్థకు సాయమందించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గూగుల్ ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా ఈ పోటీలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 5 వ తేదీ వరకు భారతదేశంలో నమోదైన స్వచ్ఛంద సంస్థలు ఆన్ లైన్ లో ఈ పోటీలో పాల్గొనవచ్చని ఆ సంస్థ ప్రతినిధి అరోరా తెలిపారు.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ అధికారులు ఈ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అన్ని ప్రాజెక్టులను అక్టోబర్ 21 నాటికల్లా పరిశీలించి అందులో అత్యుత్తమమైన 10 ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఆ పది స్వచ్ఛంద సంస్థలకు పోటీ పెట్టి వారిలోంచి ఓ మూడింటిని ఎంపిక చేసి వాటికి తలా 3 కోట్ల రూపాయల అందజేస్తారు. వాటి ద్వారా ఆర్తుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నిది గూగుల్ బృహత్తరమైన ఆలోచన. మరి ఇంకెందుకు ఆలస్యం అప్లై చేయండి.