Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆహారభద్రతే 'మన బియ్యం' పథకం లక్ష్యం

రాష్ట్రంలోని పేదలందరికీ ఆహారభద్రత కల్పించేందుకే ప్రభుత్వం మన బియ్యం పథకం చేపట్టిందని మంత్రి  శ్రీధర్ బాబు అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ లో పౌర సరఫరాల సంస్థ సాంకేతిక ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీని శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆహారభద్రత కల్పించడం ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల బాధ్యత అని అన్నారు. 

More Telugu News