తెలంగాణకు మరో రాజధాని: హర్షకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణకు మరో రాజధాని: హర్షకుమార్

అమలాపురం ఎంపీ హర్షకుమార్ సరికొత్త వాదనను లేవదీశారు. హైదరాబాదు మూడు ప్రాంతాలకు చెందినదని, నగరంపై అందరికీ హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, హైదరాబాదును మూడు ప్రాంతాలకు కేటాయించి, తెలంగాణకు మరో రాజధాని అన్వేషించాలని ఆయన సూచించారు. అప్పుడు సీమాంధ్రుల్లో ఎవరూ బాధపడరని ఆయన వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సంస్థలకు హెడ్డాఫీసులన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపారు.

ఇక, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తానని కేసీఆర్ చెప్పడాన్ని హర్షకుమార్ కొట్టిపారేశారు. ఆయనెవరు రక్షణ కల్పించడానికని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా ఇతర సీమాంధ్రుల వలె తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేశారు. ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కుందని ఎంపీ స్పష్టం చేశారు.

More Telugu News