లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
ఉరుకులు పరుగుల జీవితం.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇంట్లో పనులకూ సమయం చిక్కదు.. ఆఫీసుకు వెళ్లే ముందు హడావుడి, ఇంటికి తిరిగి రాగానే అలసట. అలాంటి వారికి తోడ్పడే గృహోపకరణాల్లో డిష్ వాషర్ చాలా ముందుంటుంది. గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు.. ఇలా అన్నింటినీ అది శుభ్రంగా తోమేసి, కడిగేసి పెడుతుంది. అంతేకాదు తడిగా ఉండి బ్యాక్టీరియా చేరకుండా పూర్తిగా ఆరబెడుతుంది కూడా. కానీ డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది, ధర ఎంత ఉంటుంది, ఇంట్లో వినియోగించుకోగలమా లేదా.. అనే సందేహాలతో చాలా మంది వాటికి దూరంగా ఉంటుంటారు. వినియోగం చాలా సులువు, విద్యుత్ ఖర్చూ తక్కువే, ధరలు మాత్రం కొంచెం ఎక్కువ.. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం..
ఎలా వినియోగించుకోవచ్చు?
డిష్ వాషర్ లో ఒక్కో రకం పాత్రలు పెట్టడానికి వేర్వేరుగా ఏర్పాట్లు ఉంటాయి. ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, గిన్నెలను వాటికి కేటాయించిన చోట అమర్చి డిష్ వాషర్ మూత పెట్టేస్తే సరిపోతుంది. అలాగే నీటి పైపు కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ సరిగా ఉన్నాయో లేదో చూడాలి అంతే. ఆ తర్వాత అంతా ఆటోమేటిగ్గా డిష్ వాషర్ పాత్రలను నానబెట్టడం, శుభ్రం చేయడం, కడగడం, ఆరబెట్టడం చేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
పాత్రలన్నీ పెట్టేసి ఆన్ చేసిన తర్వాత డిష్ వాషర్ లో నీళ్లు నిండుతాయి. ఆ నీటిని ఓ నిర్ణీత స్థాయి వరకూ వేడి చేసుకుంటుంది. ఆ వేడి నీటిలో పాత్రలను నానబెడుతుంది. తర్వాత ఆ నీటిని తొలగించి... లోపల ఏర్పాటు చేసి ఉన్న జెట్ స్ప్రే పైపుల ద్వారా వేడి నీటిని వేగంగా పాత్రలపైకి అన్ని మూలల నుంచి చిమ్ముతుంది.
డిష్ వాషర్ పనిచేసే విధానాన్ని ఇక్కడ చూడవచ్చు.
అవసరాన్ని బట్టి పరిమాణాన్ని ఎంచుకోవచ్చు
శాంసంగ్, ఐఎఫ్ బీ, బోస్చ్, ఎల్ జీ, సీమెన్స్, వర్ల్ పూల్, ఎలక్ట్రోలక్స్ తదితర కంపెనీలు డిష్ వాషర్లను విక్రయిస్తున్నాయి. డిష్ వాషర్ల సామర్థ్యాన్ని ‘ప్లేట్ సెట్టింగ్’లలో కొలుస్తారు. ఒక ప్లేట్ సెట్టింగ్ అంటే.. ఒక ప్లేట్ (భోజనం చేసే పళ్లెం), ఒక డెసర్ట్ ప్లేట్ (చిన్న పళ్లెం), గ్లాసు, టీకప్పు, సాసరు, ఒక్కో చాకు, ఫోర్క్, సూప్ స్పూన్, డెసర్ట్ స్పూన్, టీస్పూన్లు, ఒక వంట (కర్రీ లేదా రైస్) పాత్ర పెట్టుకోవచ్చు. సాధారణంగా 12 ప్లేట్ సెట్టింగ్ అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో డిష్ వాషర్లు లభిస్తుంటాయి. అయితే మనం వివిధ పరిమాణాల్లో ఉండే వేర్వేరు రకాల పాత్రలు ఉపయోగిస్తుంటాం. వాటన్నింటినీ కలిపి మిక్స్ డ్ గా పరిశీలిస్తే... 12 ప్లేట్ సెట్టింగ్ డిష్ వాషర్ లో రెండు మూడు వంట పాత్రలు, 8 వరకు ప్లేట్లు, కడాయి, కుక్కర్, 15-20 చెంచాలు, ఫోర్కులు, నాన్ స్టిక్ ప్యాన్, 8 వరకు గ్లాసులు, టీ కప్పులు వంటివి ఒకేసారి శుభ్రం చేసుకోవచ్చు.
ధరలు ఎలా ఉంటాయి..?
సాధారణంగా 12 ప్లేట్ సెట్టింగ్ డిష్ వాషర్ ధర కంపెనీని బట్టి రూ.32,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది. అదే 14 ప్లేట్ సెట్టింగ్, 15 ప్లేట్ సెట్టింగ్ ధరలు రూ.42,000 నుంచి రూ.50,000 వరకు ఉంటాయి. అయితే భారత్ లో డిష్ వాషర్లకు ఇంకా బీఈఈ స్టార్ రేటింగ్ ఇవ్వడం లేదు. అందువల్ల యురోపియన్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రమాణాలను అనుసరిస్తున్నారు. వీటిలో ఏ+++, ఏ++, ఏ+, ఏ, బీ ఇలా రేటింగులు ఉంటాయి. ఏ+++ రేటింగ్ ఉంటే అత్యుత్తమ విద్యుత్ ఆదా సామర్థ్యమున్నట్లు లెక్క. వీటి ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.
విద్యుత్ వినియోగం సంగతేంటి
డిష్ వాషర్లు వేర్వేరు పరిమాణాలలో ఉంటాయి. గిన్నెలు శుభ్రం చేసేందుకు వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి. అందువల్ల పరిమాణం, క్లీనింగ్ ఆప్షన్లను బట్టి విద్యుత్ వినియోగం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తక్కువ మురికి ఉన్న పాత్రలను శుభ్రం చేసే ఆప్షన్ తో ఒకసారి వినియోగానికి (గిన్నెలు నానబెట్టడం, క్లీనింగ్, డ్రైయింగ్ కలిపి) 1 యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. ఎక్కువ మురికి ఉంటే 2 యూనిట్లు అవుతుంది. ఈ లెక్కన డిష్ వాషర్ కు నెలకు సగటున 45 నుంచి 60 యూనిట్ల విద్యుత్ అవసరం.
(కంపెనీలను బట్టి ఆప్షన్లు, వాటి పేర్లు మారుతుంటాయి. వాటిని గమనించాలి)
డిష్ వాషర్ తో ఎన్నో ప్రయోజనాలు..
కొనే ముందు ఇవి గమనించండి
డిష్ వాషర్ లో పాత్రలు ఎలా అమర్చాలో ఈ వీడియోలో చూడొచ్చు..
వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే చాలు