లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
ఇంట్లో కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి, నీళ్లు, ఇతర కూల్ డ్రింకుల వంటివి చల్లబరుచుకోవడానికి, ఐఎస్ క్యూబ్స్ కోసం రిఫ్రిజిరేటర్ ను వినియోగిస్తుంటాం. ప్రస్తుత వేగవంతమైన జీవితం కారణంగా మన నిత్యావసర వినియోగ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కానీ రిఫ్రిజిరేటర్లలో ఎన్ని రకాలున్నాయి, మనకు ఎలాంటిది అవసరం, ఏమేం సదుపాయాలు ఉండాలి, ఏ పరిమాణం గల ఫ్రిజ్ తీసుకుంటే సరిపోతుంది, విద్యుత్ వినియోగం ఎలా ఉంటుంది, విద్యుత్ ను పొదుపు చేసే ఇన్వర్టర్ ఫ్రిజ్ లు ఏమిటి, వారెంటీ ఏమైనా ఉంటుందా, ఫ్రిజ్ లకు వచ్చే సమస్యలు, పరిష్కారాలపై చాలా మందికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. మరి ఫ్రిజ్ కొనేటపుడు ఏమేం పరిశీలించాలి, మన అవసరాలకు తగినట్లు ఏలా ఎంచుకోవాలనేది చూద్దాం..
రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది?
రిఫ్రిజిరేటర్లలో కీలకమైన భాగాలు కంప్రెసర్, రిఫ్రిజిరెంట్ (చల్లబరిచే రసాయనం). రిఫ్రిజిరెంట్ ను కంప్రెస్ చేస్తూ ఫ్రిజ్ లోపల బయట గొట్టాల ద్వారా ప్రయాణించేలా చేసేది కంప్రెసర్. ఫ్రిజ్ లోపలి భాగంలో ఏర్పాటు చేసే సన్నని గొట్టాల ద్వారా ప్రయాణించే రిఫ్రిజిరెంట్ లోపలి వేడిని గ్రహించి... బయటికి వచ్చాక ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే గొట్టాల ద్వారా ప్రయాణిస్తూ వేడిని బయటకు విడుదల చేస్తుంది. దీంతో ఫ్రిజ్ లోపలి భాగంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. ఫ్రిజ్ పనిచేసే ప్రాథమిక సూత్రం ఇదే. సాధారణంగా అన్ని రిఫ్రిజిరేటర్ల పనితీరు, వాటిల్లో అందించే సాధారణ సదుపాయాలు ఒకేలా ఉంటాయి. కానీ కంపెనీలు అదనపు ఫీచర్లను జోడించి విక్రయిస్తుంటాయి. అయితే ప్రధాన ఫీచర్లను బట్టి రిఫ్రిజిరేటర్లను డైరెక్ట్ కూల్, ఫ్రాస్ట్ ఫ్రీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.
డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు..
రిఫ్రిజిరేటర్ లోపలి భాగంలోనే ఫ్రీజర్ ఉండే వాటిని డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లుగా చెబుతారు. సాధారణంగా ఇవి సింగల్ డోర్ తోనే ఉంటాయి. వీటిల్లో రిఫ్రిజిరెంట్ మొదట ఫ్రీజర్ భాగంలో నుంచి మొదలై.. మిగతా భాగం వెంట ప్రయాణిస్తుంది. దాంతో ఫ్రీజర్ లో ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయికి చేరుతుంది. అందువల్ల ఫ్రీజర్ లోపలి అంచుల వెంట మంచు ఏర్పడి పేరుకుపోతూ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయడం ద్వారా గానీ లేకపోతే రిఫ్రిజిరేటర్ లో ఏర్పాటు చేసే ‘డీ ఫ్రాస్ట్’ బటన్ ను నొక్కడం ద్వారాగానీ పేరుకుపోయిన మంచును తొలగించుకోవచ్చు. ‘డీఫ్రాస్ట్’ చేసినప్పుడు ఫ్రీజర్ లోపలివైపున అంతర్గతంగా ఏర్పాటు చేసిన హీటర్ మంచును కరిగిస్తుంది. ఇక ఈ రిఫ్రిజిరేటర్లు అత్యధికంగా 300 లీటర్ల సామర్థ్యం వరకే ఉంటాయి. వీటి విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.
ఇవీ సౌకర్యాలు..
ఇబ్బందులు ఇవి..
ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు
వీటిల్లోని ఫ్రీజర్లలో ఉండే హీటింగ్ ఎలిమెంట్ నిత్యం పనిచేస్తూ మంచు ఏర్పడకుండా చేస్తుంది. సాధారణంగా ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు డబుల్ డోర్ లేదా అంతకన్నా పెద్దవిగానే ఉంటాయి. కనీసం 245 - 250 లీటర్ల సామర్థ్యం నుంచి వీటి శ్రేణి ప్రారంభమవుతుంది. వీటిల్లో పైభాగంలో ఫ్రీజర్ ఉండే ‘టాప్ మౌంట్ రిఫ్రిజిరేటర్’, కింది భాగంలో ఉండే ‘బాటమ్ మౌంట్ రిఫ్రిజిరేటర్’, రెండు కన్నా ఎక్కువ డోర్లుండే ‘మల్టీడోర్ రిఫ్రిజిరేటర్’, తలుపుల్లా పక్కపక్కన డోర్లు ఉండే ‘సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్’ వంటి రకాలు కూడా ఉన్నాయి.
వీటితో ఉపయోగాలెన్నో..
ఇబ్బందులూ ఉన్నాయి..
విద్యుత్ పొదుపు చేసే ఇన్వర్టర్ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్లు
ఇన్వర్టర్ టెక్నాలజీతో రూపొందిన రిఫ్రిజిరేటర్లతో దాదాపు 40% వరకు విద్యుత్ పొదుపు కావడంతోపాటు నిల్వ చేసిన ఆహార పదార్థాల నాణ్యత కూడా బాగుంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ టెక్నాలజీతో రూపొందిన రిఫ్రిజిరేటర్లు ఇన్వర్టర్లపై ఆధారపడి నడవగలవు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో థర్మోస్టాట్ సహాయంతో కంప్రెసర్ నియంత్రణ ఆధారపడి ఉంటుంది. ఫ్రిజ్ లోపలి భాగంలో చల్లదనం నియమిత స్థాయికి చేరగానే థర్మోస్టాట్ కంప్రెసర్ ను పూర్తిగా ఆపివేస్తుంది. దాంతో ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. ఇది ఒక నియమిత స్థాయికి చేరగానే థర్మోస్టాట్ తిరిగి కంప్రెసర్ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో చల్లబడడం మొదలవుతుంది. అంటే ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. కంప్రెసర్ ఆన్ అయినప్పుడల్లా ఎక్కువగా విద్యుత్ ను తీసుకుంటుంది. ఆన్ లో ఉన్నంత సేపూ పూర్తిస్థాయిలో పనిచేస్తూ గరిష్ట స్థాయిలో విద్యుత్ ను వినియోగించుకుంటుంది. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్లలో ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతకు అనుగుణంగా అవసరమైన వేగంతో కంప్రెసర్ పనిచేస్తుంది. మధ్యలో కంప్రెసర్ ఆఫ్ కావడం, తిరిగి ఆన్ కావడం ఉండదు. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలు కూడా స్థిరంగా ఉండి, ఆహార పదార్థాల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
కరెంటు లేకున్నా చల్లదనం
కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా లేకున్నా కూడా రిఫ్రిజిరేటర్ లో చల్లదనం కొనసాగేలా సరికొత్త సాంకేతికతతో కొన్ని కంపెనీలు రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఎల్ జి కి చెందిన డ్యూరాచిల్, పవర్ కట్ ఎవర్ కూల్, వర్ల్ పూల్ సంస్థకు చెందిన పవర్ కూల్, ఎలక్ట్రోలక్స్ సంస్థ యూరో చిల్, సామ్ సంగ్ కూల్ ప్యాక్ తదితర పేర్లతో ఇటువంటి రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టాయి.
ఫ్రీజర్ ను ఫ్రిజ్ లా.. ఫ్రిజ్ ను ఫ్రీజర్ లా...
కొన్ని కంపెనీలు ఫ్రీజర్ ను ఫ్రిజ్ లా.. ఫ్రిజ్ ను ఫ్రీజర్ లా ఉపయోగించుకోగలిగే రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఐస్ క్రీములు, ఫ్రాజెన్ ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా ఉంచాల్సి వచ్చినప్పుడు ఫ్రిజ్ మోత్తాన్నీ ఫ్రీజర్ లాగా... ఫ్రీజ్ చేయవలసిన వస్తువులేమీ లేనప్పుడు ఫ్రీజర్ ను కూడా సాధారణ ఫ్రిజ్ లాగా వాడుకోవచ్చు. దీనివల్ల అవసరాలను తీర్చుకోవడంతోపాటు విద్యుత్ నూ పొదుపు చేసుకోవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
స్టార్ రేటింగ్ చూడండి
స్టార్ రేటింగ్ ఎక్కువగా ఉన్న రిఫ్రిజిరేటర్ ను ఎంచుకోవడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. మంచి కంపెనీకి చెందిన ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ విద్యుత్ వినియోగం అదే సామర్థ్యమున్న సాధారణ రిఫ్రిజిరేటర్ కంటే 15% నుంచి 25% దాకా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 210 లీటర్ల సామర్థ్యమున్న డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ 2 స్టార్ రేటింగ్ తో అయితే ఏటా 270 యూనిట్లు, 3 స్టార్ తో 250 యూనిట్లు, 4 స్టార్ తో 230 యూనిట్లు, 5 స్టార్ తో 210 యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటుంది.
విద్యుత్ వినియోగం ఎలా ఉంటుంది?
కొనే ముందు ఈ అంశాలను గమనించండి
సమస్యలు.. పరిష్కారాలు
కూలింగ్ సరిగా కాకపోతుండడం, ఫ్రీజర్ లో మంచు దట్టంగా గడ్డకట్టుకుపోవడం, డబుల్ డోర్ ఫ్రిజ్ లలో పైన ఫ్రీజర్ లో కూలింగ్ అవుతూ కింద ఫ్రిజ్ లో కూలింగ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కూలింగ్ కాకపోవడానికి ప్రధాన కారణం కంప్రెసర్ లో గ్యాస్ తగ్గిపోవడం, గ్యాస్ లీకేజీ, గ్యాస్ సర్క్యులేషన్ జరిగే పైపుల్లో అడ్డంకులు ఏర్పడడం, కంప్రెసర్ సరిగా పనిచేయకపోవడం వంటివే కారణం. వీటిని పరిశీలించడం ద్వారా పైపులను సరిచేయడం, కంప్రెసర్ లో గ్యాస్ నింపించడం ద్వారా కూలింగ్ పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఫ్రీజర్ లో మంచు పేరుకుపోయి, డీఫ్రాస్ట్ బటన్ ను నొక్కినా మంచు అలాగే ఉండిపోతుంటుంది. కూలింగ్ సెన్సార్ లేదా హీటర్ సరిగా పనిచేయకపోవమే, డబుల్ డోర్ ఫ్రిజ్ లలో టైమర్ పనిచేయకపోవడం దీనికి కారణం. ఈ భాగాలను పరిశీలించి.. సంబంధిత భాగాన్ని మార్చడమో, మరమ్మతు చేయడమో చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఇందుకోసం ఆ రిఫ్రిజిరేటర్ కంపెనీ ప్రతినిధితోగానీ, మంచి నిపుణులతోగానీ మరమ్మతు చేయించుకోవడం మంచిది.
ఫ్రిజ్ నిర్వహణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..