తెలంగాణ పవర్ హౌస్- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు - వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

                                                       తెలంగాణ పవర్ హౌస్

                                         Press Note     హైదరాబాద్: 25 సెప్టెంబర్,2022.

- కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రం
- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు
- వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- 2014-15 నుండి 2021-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కో సం రూపాయలు -36,890 కోట్ల సబ్సిడీని నాణ్యమైన విద్యుత్ కోసం అందించిన రాష్ట్ర ప్రభుత్వం
- 37,099 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థల పటిష్టం

2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దార్శనికతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఎనిమిది సంవత్సరాలల్లో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలో విద్యుత్ పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటును అందుబాటులోకి తెచ్చారు. 2018 జనవరి 1 నుండి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్వి నియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

    
రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు విద్యుత్ ను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుండి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ను పొందేలా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది 2014 నుండి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ లు విడుదలయ్యాయి. రైతన్ననికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంతో వ్యవసాయ రంగానికి 36,890 వేల కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం అందించింది.

     
గత 8 సంవత్సరాల లో అన్ని వర్గాలకు 37,099 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. 2014 నుండి సంవత్సరాల లో ట్రాన్స్కో ద్వారా 400 కే.వి
సబ్స్టేషన్లో 17, 200 కేవీ సబ్స్టేషన్లు 48, 132 కెవి సబ్స్టే షన్లు 72, ఈహెచ్ టి సబ్ స్టేషన్లు 137, 11107 CKM ఈ హెచ్ టి లైన్ , డిస్కంల ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ 1038 లు 3.65 లక్షల డిటిఆర్ లను నిర్మించి విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట పరచడం జరిగినది. 14160 మెగావాట్లు పిక్ డిమాండ్ ను కూడా మీట్ చేయడం జరిగినది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం పరస్పర పనులను పవర్ హాలిడే ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్ తో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఉంటే 2021 నాటికి 2012 యూనిట్లుకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలో 2.47% అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98% ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ తో దేశంలోనే తెలంగాణ
రాష్ట్రం ఘనత సాధించింది.

      రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06% ఉన్న టి అండ్ డి నష్టాలను 11.01% తగ్గించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్ లో సామర్థ్యం 73 MW ఉంటే నేడు అది 4950 MW కు చేరింది. ఒకపక్క విద్యుత్ఉ త్పత్తి చర్యలు తీసుకుంటూ మరోపక్క సరఫరా పంపిణీ ప్రాధాన్యతనిస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెల 59 66 42 మంది ఎస్సీ వినియోగదారులకు, 321 736 మంది ఎస్టీ వినియోగదారులకు 2017 నుండి ఇప్పటివరకు 656 కోట్ల విలువగల విద్యుత్ను ఉచితంగా ఇవ్వడం అయినది 29365 నాయి బ్రాహ్మణులకు సెలూన్ లకు 56616 లాండ్రీ షాపులకు ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది 66 67 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లోమ్స్ కు యూనిట్ కి రెండు రూపాయల సబ్సిడీ ఇస్తుంది.

      ================================================================
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్జా రీచేయనైనది.

More Press News