కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు పాటించండి: వీఎంసీ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

  • సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ తనిఖీ
  • న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌
విజయవాడ: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సెంట‌ర్ లో చేప‌డుతున్న‌ జాగ్ర‌త్త‌ల‌ను న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ స్వ‌యంగా ప‌రిశీలించారు. గురువారం న‌గ‌ర పాల‌క సంస్థ సిబ్బందితో క‌లిసి క‌మిష‌న‌ర్ భ‌వానీపురం షాదిఖాన‌ను ప‌రిశీలించారు. సిబ్బంది తీసుకుంటున్న జాగ్ర‌త్తులను ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద శానిటైజ‌ర్‌తో పాటు ధ‌ర్మ‌ల్ స్కాన్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.

121, 123, 124 సచివాలయల‌ తనిఖీ:
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. గురువారం భవానీపురం లారీ స్టాండ్‌, బొబ్బ‌రి గ్రౌండ్స్  నందలి 121 & 123,124 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని తెలిపారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

More Press News