నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా తొలి స్వర్ణ పతకాన్నిసాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ లో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు.

నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి, ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

More Press Releases