27న థియేటర్స్‌లోకి సిద్ధుగాడి ప్రేమకథ

Entertainment
Advertisement
తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమపై అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సినిమా అనేది ఆయనకు కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల. ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు.

విదేశాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు సినిమా పట్ల తనకున్న అభిమానాన్ని మరచిపోకుండా, తన ఆలోచనలకు వెండితెర రూపం ఇవ్వాలనే లక్ష్యంతో దర్శకుడిగా అడుగులు వేస్తున్నారు. తన ఆలోచనలు, అనుభవం, సృజనాత్మకతతో ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలనే ప్రయత్నమే “సిద్ధుగాడి లవ్ స్టోరీ”.

శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు **సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27 న విడుదలకు సిద్దమవుతోంది 

ఈ చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తుండగా, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ నటిస్తున్నారు. ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి 

దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, “నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అలాగే టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


Advertisement
Siddu Gadi Love StoryRamesh Babu Cherukuri

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06
..More Press News