మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"
Advertisement
"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ "రాజిగాడు రాజయ్యాడు" అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత చిన్ని మాట్లాడుతూ - రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నేను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచీ ఉన్నాను. నేను సినిమాలను ఇష్టపడతా. అయితే నేనే ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ అయ్యేవరకు జరిగే జర్నీ నేను చూశాను. దాంతో నాకు సినిమాల మీద గౌరవం మరింత పెరిగింది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లే అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాం. సినిమా బాగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ - మా ప్రొడ్యూసర్ చిన్ని వల్లే మా అందరి కల నిజమవుతోంది. విజయ్ భాస్కర్ గారు రాసిన నాటకం ఈ సినిమాకు మూలం. ఆయనతో మూడు నెలల పాటు స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసి సినిమాకు కథను అడాప్ట్ చేసుకున్నాం. పల్లె కన్నీరు పెడుతుందో అనే గొప్ప పాట రాసిన గోరటి గారే ఈ సినిమాకు అలాంటి పాట రాయగలరని ఆయనను అప్రోచ్ అయ్యాం. మా నాన్న పాత్ర కూడా ఆయనే చేయాలని కోరాం. ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్లు నా ఫ్యామిలీలా భావిస్తా. మా మూవీకి జగదీశ్ ఏడు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. ఆ పాటలు మా సినిమాకు సోల్ లా మారాయి. మా డీవోపీ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. గొప్ప పర్పస్ ఉన్న ఇన్స్ పైరింగ్ మూవీ ఇది. మీరంతా మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. అన్నారు.
గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ - చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలు కొందరు సృష్టించినవి. కానీ కళ అయిన సినిమాకు అలాంటి బేధం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ బేధాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుంది. ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అవార్డ్స్ పొందిన వారు. ఆయన నాటకం కూడా నంది పురస్కారాలు పొందింది. అలాంటి గొప్ప కథను ఈసినిమాకు ఎంచుకున్నారు అల్తాఫ్. నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా ఎప్పుడూ బోర్ రాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. మూస చిత్రాలు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ కూడా చేశాను. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు. ఒక జీవితాన్ని చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్ గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అన్నారు.
Advertisement