'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

Entertainment
Advertisement
రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మించిన చిత్రం ‘అ (AH)’. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 12న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతుంటాయి. ‘అ (AH)’ చిత్రంతో దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల ప్రధాన బలం. అర్చనా అయ్యర్ ఈ సారి రాహుల్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలి. నాకు రాహుల్ మంచి స్నేహితుడు. మేం ఇద్దరం కలిసి ఇది వరకే పని చేశాం. రాహుల్ చాలా మంచివాడు. అతడికి సినిమా తప్పా వేరే ఆలోచన ఉండదు. నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయాలి’ అని అన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ .. ‘రాహుల్ నాకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. ‘అ (AH)’ టీజర్, ట్రైలర్ బాగా నచ్చింది. శ్రీ చరణ్ మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరా వర్క్ బాగుంది. అర్చనా గారి సక్సెస్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. చిన్నప్పుడే నేను రాహుల్ టాలెంట్ చూసి షాక్ అయ్యాను. రాహుల్ కష్టాన్ని దగ్గరుండి చూశాను. రాహుల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను. ‘అ (AH)’ చిత్రంతో రాహుల్‌కి మంచి విజయం దక్కాలి. నవంబర్ 12న ఈ సినిమా రాబోతోంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ లాంటి మంచి సినిమాల్ని ప్రమోట్ చేసేందుకు వచ్చిన నందినీ రెడ్డి గారికి, ఆకాష్ గారికి, శివానీ, శివాత్మిక గార్లకు థాంక్స్. శ్రీ చరణ్ బీజీఎం నాకు చాలా ఇష్టం. టీజర్, ట్రైలర్ నాకు చాలా నచ్చిది. పోస్టర్ డిజైనింగ్, టైటిల్‌లోనే సినిమా కథను చెప్పడం బాగుంది. ఇండస్ట్రీలో ఇలాంటి నూతన దర్శక, నిర్మాతలు రావాలి. ‘శంబాల’తో అర్చన మంచి విజయాన్ని అందించింది. అదే సక్సెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. రాహుల్ చాలా మంచి వ్యక్తి. ఇందులో అతని స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే ‘ఈశ్వర్’లో ప్రభాస్‌లా కనిపించారు. నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. ఈ సినిమాని అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ డార్క్ క్రైమ్ జానర్‌లో ఉంటుంది. మీరు (ఆడియెన్స్) థియేటర్‌లో కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం కూడా బోరింగ్‌గా అనిపించదు. సినిమా నవంబర్ 12న రాబోతోంది. మూవీ నచ్చితే ఓ పది మందికి చెప్పండి. కో ప్రొడ్యూసర్ అభినవ్ గారు మాకెంతో సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ సాయి గారు గోల్డ్ మెడలిస్ట్ అని నాకు ఈ మధ్యే తెలిసింది. అతనికి సినిమాలంటే పిచ్చి. ఈ చిత్రంతో ఆయనకు మంచి విజయం దక్కాలి. మా క్రియేటివ్ హెడ్ సంతోష్ గారికి థాంక్స్. శ్రీ చరణ్ గారి బీజీఎంతో మా సినిమా స్థాయి పెరిగింది. ఆయన బీజీఎం టాప్ నాచ్‌లో ఉంటుంది. ఈ కథ అంతా అర్చనా గారి చుట్టూనే తిరుగుతుంది. నా కోసం వచ్చిన నందినీ గారికి, వంశీ గారికి, ఆకాష్‌కి, శివానీ, శివాత్మికలకు థాంక్స్. నవంబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రతీ అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్ చేసేలా ఉంటుంది. శ్రీ చరణ్ గారితో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ బెస్ట్ ఇస్తుంటారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాయి గారికి థాంక్స్. రాహుల్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నవంబర్ 12న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ .. ‘‘అ (AH)’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీ చరణ్ అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. మోనిష్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిషేక్ గారు, సూర్య గారు, గ్యారీ, అభినవ్, సంతోష్ గారికి థాంక్స్. సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన రాహుల్ గారికి, అర్చనా గారికి థాంక్స్’ అని అన్నారు.






Advertisement
AHAH tralerAh release datecinema news

More Press News

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13
..More Press News