Rayavalasa: నవంబర్ 20న “రాయవలస” విడుదల

నవంబర్ 20న “రాయవలస” విడుదల

నవంబర్ 20న “రాయవలస” విడుదల
కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”.  రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. RaysuN ప్రొడక్షన్స్ పై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.  డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కార్తిక్ త్రిశూలంతో అమ్మవారి విగ్రహం ముందు నిలబడి వుండటం పవర్ ఫుల్ గా ఉంది. 

ఈ చిత్రంలో శ్రీష నులు హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అర్జున్ బాలా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తిక్ జయంతి వంటి ప్రముఖ గాయకులు పాటలను ఆలపించారు.

భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా “రాయవలస” ప్రేక్షకులను అలరించనుంది.
Rayavalasa
Rayavalasa Release date
cinema news

Watch Today's Deals on Amazon

More Press News