నందమూరి కల్యాణ్‌రామ్ అతిథిగా డ్రామా జూనియర్స్ 9 గ్రాండ్ ఫినాలే, సరిగమప-ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ మెగా లాంచ్.. ఈ శని, ఆదివారాల్లో మీ జీ తెలుగులో!

నందమూరి కల్యాణ్‌రామ్ అతిథిగా డ్రామా జూనియర్స్ 9 గ్రాండ్ ఫినాలే, సరిగమప-ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ మెగా లాంచ్.. ఈ శని, ఆదివారాల్లో మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 21 ఆగస్టు 2026: తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమాలతో అలరిస్తున్న జీ తెలుగు ఈ వీకెండ్ డబుల్ ధమాకా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ సక్సెస్ఫుల్గా సాగుతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేతో పాటు, జీ తెలుగు పాపులర్ సింగింగ్ రియాలిటీ షో సరిగమప – ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ మెగా లాంచ్ ద్వారా ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించనుంది.

ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగాఅనిల్ రావిపూడిశ్రీకాంత్, రోజా జడ్జెస్‌గాధన్యబాలకృష్ణ మెంటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి కల్యాణ్‌రామ్ విచ్చేశారు. నందమూరి కుటుంబంలోని మూడు తరాలకు చెందిన ఐదుగురు హీరోలను గుర్తు చేస్తూ కార్తికేయ అభిరామ్ చేసిన స్కిట్ఫ్రస్టేటెడ్ మెయిడ్‌గా వైశాలి చేసిన స్కిట్స్ ఫినాలే ఎపిసోడ్‌లో హైలైట్‌గా ఉండనున్నాయి. డ్రామా జూనియర్స్ 9 విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఆగస్టు 22 శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను తప్పక చూడండి.

గత 17 సీజన్ల ద్వారా ఎందరో మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన జీ తెలుగు సరిగమప ఇప్పుడు 18వ సీజన్‌ను ఈ ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోంది. ‘ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ ట్యాగ్‌తో రానున్న ఈ సీజన్కి సుధీర్ హోస్ట్‌గాసిమ్రాన్ చౌదరిఇమ్మానుయేల్ మెంటర్స్‌గాఅనిల్ రావిపూడిఅనంత శ్రీరామ్ఎస్.పి. శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఈ సీజన్‌లో టైటిల్ కోసం దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పోటీపడనున్నారు. సరిగమప – ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ టైటిల్ పోరు ఎలా సాగుతుందో తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ షోను తప్పకుండా చూడండి.

డ్రామా జూనియర్స్ గ్రాండ్ ఫినాలే, సరిగమప – ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ మెగా లాంచ్ ఈ శని, ఆదివారాల్లో రాత్రి గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!

Kalyan Ram
Zee Telugu

Watch Today's Deals on Amazon

More Press News