‘ప్రేమనే ఊరిలో’ టీజర్ విడుదల!
మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను తణికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ మేరకు
తణికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘సురేష్ కొండేటి సామాన్య జర్నలిస్ట్ నుంచి పత్రికాధినేతగా ఎదగడం మామూలు విషయం కాదు. ‘సంతోషం’ అనే పేరులోనే ఓ పాజిటివిటీ ఉంది. ‘ప్రేమనే ఊరిలో’ చిత్రంతో తండ్రి గొప్పదనం చక్కగా చూపించారనిపిస్తోంది. నేను గతంలో చెప్పిన నాన్న మీద కవిత ఎంతగానో ప్రాచుర్యం పొందింది. తండ్రే తల్లిలా పెంచిన కథతో ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తీశారు. ప్రేమతో దేన్నైనా సాధించగలం. అలాంటి ప్రేమతో తీసిన ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా టీజర్‌ను విడుదల చేసిన తణికెళ్ల భరణి గారికి థాంక్స్’ అని అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్ చూసిన తర్వాతే ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ టీజర్‌కి శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ అద్భుతంగా కుదిరింది. మా కోసం టీజర్ రిలీజ్ చేసిన తణికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాన్న ఎందుకో వెనకబడ్డారు అంటూ తణికెళ్ల భరణి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత నేను ఆయనతోనే ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నాను. మా కోసం ఆయన టీజర్‌ను రిలీజ్ చేశారు. ది బెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అని అన్నారు.
KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.