పదేళ్లుగా మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను రంభ ఊర్వశి మేనక’ లో చూస్తారు: అల్లరి నరేష్
కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను సరైన కామెడీ సినిమా చేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కాకపోతే నేను కామెడీని ఎప్పుడూ వదల్లేదు. ఒక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. చాలా రోజుల తర్వాత చంద్ర మోహన్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలతో కలిసి ఈ సినిమా చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారికి పెద్ద అభిమానిని. ‘నా సామిరంగ’ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఇప్పుడు ఆయన బ్యానర్‌లో సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్లో ఉన్న నటీనటులందరినీ చూస్తుంటే నాన్నగారి సినిమాలు గుర్తొచ్చేవని సెట్లో అందరూ చెప్పేవారు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
దాదాపు పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు థాంక్యూ. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. చైతన్ భరద్వాజ్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 4న కచ్చితంగా మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. ఈ సినిమాతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని గ్యారెంటీగా చెబుతున్నాను.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నిర్మాతగా నా జర్నీ ప్రసాద్ గారితో కలిసి మొదలైంది. నేను ప్రతి సినిమా కథ విన్న తర్వాత ప్రసాద్ గారిని సంప్రదిస్తాను. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ బ్యానర్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నరేష్ గారు తన వింటేజ్ కామెడీతో మీ అందరినీ అలరించబోతున్నారు. ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రసాద్ గారికి, నాగార్జున గారికి ధన్యవాదాలు. దర్శకుడు చంద్ర మోహన్ ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకుల్లో బెస్ట్ డైరెక్టర్. ఆయన ఏదైతే కథ చెప్పారో, అంతకంటే అద్భుతంగా సినిమాను తీశారు. థియేటర్లలో నవ్వుల మోత మోగిపోతుంది. ఈ సినిమా ఒక చరిత్ర. సెప్టెంబర్ 4న అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలకు ముందే నరేష్ గారితో మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాను. సినిమా మీద అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
డైరెక్టర్ చంద్ర మోహన్ మాట్లాడుతూ: ఈ సినిమాలోని పాత్రలన్నింటినీ మీకు పరిచయం చేయడాని టీజర్‌ను విడుదల చేశాం. ఇందులో హీరో పాత్ర పేరు సూరి. మన పక్కింటి కుర్రాడిలా చాలా సహజంగా ఉంటాడు. అలాగే రంభ, ఊర్వశి, మేనక పాత్రలు ఎలా ఉంటాయో కూడా ఈ టీజర్‌లో చూపించాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, మా నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. సెప్టెంబర్ 4న థియేటర్లు దద్దరిల్లిపోతాయి.