‘గజ’ చిత్రం ద్వారా సతీష్‌కు విజయం దక్కాలి: మంచు మనోజ్
చలమలశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. పద్మనాభ రెడ్డి, జి.మధుసూదన్, ఎం.నరేంద్ర సహ నిర్మాతలు. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గజ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
మంచు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘సతీష్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. చాలా మందికి అలాంటి ధైర్యం ఉండదు. ఇంత ధైర్యంగా అడుగు వేస్తున్న సతీష్‌కి మంచి విజయం దక్కాలి. ‘గజ’ టీజర్ బాగుంది. మణిశర్మ గారు అద్బుతమైన స్కోర్ ఇచ్చారు. ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులం, మతం లేదు. సినిమా వాళ్లకి, ఆడియెన్స్‌కి, మీడియాకి తేడా ఉండదు మనమంతా ప్రేమికులం. చిన్నా, పెద్దా, కొత్త, పాత అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారు. ‘గజ’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ* .. ‘‘గజ’ చిత్రానికి గట్స్ కా బాప్ అని ట్యాగ్ లైన్ పెట్టాను. గట్స్ కా బాప్ అంటే మంచు మనోజ్ అన్న. ఆయన ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చారు. ఓ ఆడియెన్‌గా ఆలోచించే ఈ కథను రాసుకున్నాను. ఈ మూవీ కోసం అందరం కష్టపడ్డాం. ‘గజ’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోద్ది. ప్రతీ సీన్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
ఫెర్నాజ్ మాట్లాడుతూ* .. ‘‘గజ’ చిత్రంలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. కచ్చితంగా ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.
నిర్మాత మైత్రి శరణ్ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన మనోజ్ సార్‌కి థాంక్స్. సునీల్ గారు మాకు ఓ పిల్లర్‌గా నిలిచారు. మా కో ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. జగదీష్ కెమెరా వర్క్ అద్భుతంగా వచ్చింది. ఫెర్నాజ్ గొప్పగా నటించారు. నా భర్త సతీష్ జై గారు ఈ చిత్రానికి సోల్. జైకి సినిమాలంటే చాలా పిచ్చి. రైటర్, డైరెక్టర్, ప్రొడక్షన్ ఇలా అన్నింటినీ తన భుజానికి ఎత్తుకున్నారు. ప్రతీ క్రాఫ్ట్‌లో జై కనిపిస్తారు. మణిశర్మ గారు మాకు అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. ఓ సినిమా వెనకాల ఎంతో మంది కష్టం ఉంటుంది. ఇది కేవలం టీజర్ మాత్రమే. మున్ముందు చాలా కంటెంట్ వస్తుంది. మా చిత్రాన్ని థియేటర్లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
చిత్ర సమర్పకుడు చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ* .. ‘సతీష్ జైకి నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఓ సినిమాని చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్నింటినీ అద్భుతంగా హ్యాండిల్ చేసే సతీష్‌కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.