Chiranjeevi: ఆగస్టు 28న యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్..

ఆగస్టు 28న యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" థియేట్రికల్‌ రిలీజ్‌

ఆగస్టు 28న యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" థియేట్రికల్‌  రిలీజ్‌
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్  భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర స్నీక్ పీక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

"చిరంజీవి" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్, ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది "చిరంజీవి" సినిమా
Chiranjeevi
Chiranjeevi movie
Survival Drama Thriller

Watch Today's Deals on Amazon

More Press News