మహేంద్రగిరి వారాహి’లో చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు ఉన్నాయి: హీరో సుమంత్
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకురానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. 'మహేంద్రగిరి వారాహి' జర్నీ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైంది. సంతోష్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఒక మంచి నిర్మాత కోసం ఎదురు చూశాం. మధు గారు, లక్ష్మణ్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి, చాలా గొప్పగా తీర్చిదిద్దారు. టీజర్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్నాం. సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు తప్పకుండా సంతృప్తి చెందుతారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ గారికి, మధు గారికి ధన్యవాదాలు. అలాగే సుమంత్ గారు కూడా నన్ను బలంగా నమ్మారు. మా టెక్నికల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతోంది. టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలోని కంటెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాను.
నిర్మాత మధు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. టీజర్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ విడుదలైన వెంటనే థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తయింది. దర్శకుడు సంతోష్ గారు తన గాయాన్ని కూడా పక్కనపెట్టి ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశారు. అలాగే సుమంత్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్ ఎంత బాగుందో, ట్రైలర్, పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఊహించని రెండు అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
సీనియర్ నటి మంజు భార్గవి మాట్లాడుతూ: ఇది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్. ఎన్నో డివైన్ సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. నేను అమ్మవారి భక్తురాలిని. అలాంటి నన్ను ఈ సినిమాలో మంచి పాత్ర కోసం ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.