'శ్రీనివాస మంగాపురం' మహేష్ బాబాయ్‌కి చాలా నచ్చింది: హీరో జై కృష్ణ ఘట్టమనేని

'శ్రీనివాస మంగాపురం' మహేష్ బాబాయ్‌కి చాలా నచ్చింది: హీరో జై కృష్ణ ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్  పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా  జై కృష్ణ ఘట్టమనేని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు యాక్టర్ కావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?
-నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నా 16వ ఏటా యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. డిసైడ్ అయిన తర్వాత ప్రాపర్‌గా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. రెండేళ్లు ముంబై వెళ్లాను. తర్వాత పాండిచ్చేరి వెళ్లాను. అక్కడ కొంతకాలం శిక్షణ తీసుకున్న తర్వాత న్యూయార్క్ వెళ్లాను. అక్కడ కూడా రెండు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాను. తిరిగి వచ్చిన తర్వాత కథలు వినడం మొదలు పెట్టాను.

'శ్రీనివాస మంగాపురం' జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-జెమినీ కిరణ్ గారి ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆయనే అజయ్ గారిని పరిచయం చేశారు. అలా ఈ సినిమా మొదలైంది. ఇంతకుముందు కూడా నేను కొన్ని కథలు విన్నాను. కాకపోతే అజయ్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి ఎమోషన్, మంచి క్యారెక్టర్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. అలా అన్ని అంశాలు ఈ కథలో  కుదిరాయి

మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మహేష్ గారు ఈ సినిమా చూశారా ?
నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ప్రతి అడుగులో బంగారు తాతయ్య  ప్రోత్సాహం ఉంది.మహేష్ బాబాయ్ ప్రతి విషయంలో గైడెన్స్ ఇస్తారు. ఆయన ఆయన సినిమా కూడా చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయనకు చాలా నచ్చింది. నాకు మెసేజ్ కూడా పెట్టారు.  యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ చాలా నచ్చాయని చెప్పారు. స్క్రీన్ మీద చాలా డిఫరెంట్‌గా ఉన్నానని, క్యారెక్టర్‌లోకి పూర్తిగా వెళ్లిపోయానని చెప్పారు.

వైజయంతి మూవీస్‌లో మీ తొలి సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది?
-అశ్వినీ దత్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ గారి తొలి సినిమా కూడా వైజయంతి మూవీస్‌లోనే వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన యాక్సెప్టెన్స్ ఈ సినిమాకి కూడా వస్తుందని ఆశిస్తున్నాను.

మీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నారంటే చాలా అంచనాలు ఉంటాయి కదా... మీ మీద ఆ ఒత్తిడి ఉందా?
-నేను ఈ సినిమా చేస్తున్నానని తెలియక ముందే ఘట్టమనేని అభిమానులు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదటి నుంచే ఉంది. ఈ విషయంలో ఒత్తిడి మంచిదే. అది నన్ను మంచి కథల వైపు, ప్రేక్షకులను, అభిమానులను అలరించే పాత్రల వైపు తీసుకెళ్తుంది.నేను అభిమానులకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. కచ్చితంగా మంచి సినిమాలు చేయడంతో పాటు వాళ్లతో మరింత దగ్గరగా ఉండాలని భావిస్తున్నాను.

'శ్రీనివాస మంగాపురం' ఎలా ఉంటుంది?
-ఇది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రా రస్టిక్ గా అనిపిస్తాయి. అలాగే ఇది ఒక టెంప్లేట్ లవ్ స్టోరీ కాదు. ఇందులో చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ట్విస్టులు కూడా చాలా కొత్తగా ఉంటాయి.

ఇందులో మీరు చేసిన శ్రీను పాత్ర ఎలా ఉండబోతుంది?
-శ్రీను వెరీ ఫన్ లవింగ్. తనలో అల్లరి ఉంటుంది. తనకేం కావాలో తనకి క్లియర్‌గా తెలుసు. తను మంగని ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

-టీజర్, ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాల్లో మీరు మహేష్ బాబు గారిలా అనిపించారనే కామెంట్స్ వస్తున్నాయి?
కొన్ని షాట్స్‌లో అలా అనిపించొచ్చు. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం మీకు అలా అనిపించదు. సినిమా చూస్తున్నప్పుడు మీకు క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది.


నాన్నగారు మీకు చిన్నప్పుడు ఏమైనా చెప్పేవారా?
-ఆయన చాలా సినిమాలు చూసేవారు. మేమిద్దరం సినిమా గురించి చాలా మాట్లాడుకునేవాళ్లం.చిన్నప్పుడు నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి 'నిజం' సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత 'అర్జున్' సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత 'గుంటూరు కారం' సినిమా షూటింగ్‌కు వెళ్లాను.

భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. అయితే పర్సనల్‌గా నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలని ఉంది.


srinivasa mangapuram
jai krishna
Mahesh Babu
ajay bhupathi

Watch Today's Deals on Amazon

More Press News