గాయనీగాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప: ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్.. మన హైదరాబాద్లో!

Entertainment
Advertisement

హైదరాబాద్, 07 జులై 2026: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. అంతులేని వినోదంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’ ద్వారా ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు నిర్వహిస్తున్న పాపులర్ సింగింగ్ షో సరిగమప ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు తదుపరి సీజన్ ‘సరిగమప‌- ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ ను ఘనంగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు జీ తెలుగు అందిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోండి.

జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరులో ఆడిషన్స్ నిర్వహించిన అనంతరం ఈ ఆదివారం జులై 12న హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. 18-35 సంవత్సరాల వయసు గల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. 

సరిగమప - ఇండియస్ నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్ ఆడిషన్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. జులై 12, ఆదివారం, హైదరాబాద్లోని శ్రీ సారథి స్టూడియోస్, అమీర్పేట్ నందు ఆడిషన్స్ జరగనున్నాయి. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ కావద్దు! 

ఇంకెందుకు ఆలస్యం.. జీ తెలుగు ‘సరిగమప - ది నెక్ట్స్ సింగింగ్ సెన్సేషన్’ టైటిల్ కోసం మీరూ పోటీపడండి!

 

Advertisement
Zee TeluguSarigama

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News