'అమీర్ లోగ్’ సినిమా చూస్తుంటే ఆ వైబ్‌ కనిపించింది: వంశీ నందిపాటి

Entertainment
Advertisement
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

*వంశీ నందిపాటి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించారు. సినిమాని చూస్తూ నేనెంతో ఎంజాయ్ చేశాను. ఎంతో వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన చిత్రాల జాబితాల్లో ‘అమీర్ లోగ్’ ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్ఛర్ గురించి రమణా రెడ్డి గారిని కలిశాను. ‘అమీర్ లోగ్’తో రమణా రెడ్డి గారు నన్నైతే నిరుత్సాహపర్చలేదు. ఎంతో ఎత్తైన బిల్డింగ్‌లను నిర్మించే రమణా రెడ్డి గారు.. ‘అమీర్ లోగ్’ని అంతే ఎత్తులో నిలబెట్టారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. ఇలాంటి ఓ చక్కటి చిత్రానికి స్మరణ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని పది పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చి టీజర్‌ను రిలీజ్ చేసిన వంశీ గారికి థాంక్స్. నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకు వెళ్లిన ఆర్టిస్టులకు థాంక్స్. మా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్‌కి వచ్చిన వంశీ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న స్పిరిట్‌ మీడియాకి థాంక్స్. మా అందరినీ ఎంకరేజ్ చేసిన రమణ గారికి థాంక్స్. మాధవి గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. స్మరణ్ అన్న మ్యూజిక్ వల్ల మా సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాం. త్వరలోనే మరింత కంటెంట్ మా చిత్రం నుంచి రానుంది’ అని అన్నారు.

వేద జలంధర్ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన వంశీ గారికి థాంక్స్. రమణ గారి వల్లే ‘అమీర్ లోగ్’ అద్బుతంగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. గీత అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. స్మరణ్ వల్లే మా సినిమా స్థాయి పెరిగింది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. మరిన్ని అప్డేట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తామ’ని అన్నారు.

నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ నా మనసుకు నచ్చిన చిత్రం. ఈ కథ అంతా కూడా బిర్యానీ చుట్టూనే తిరుగుతుంది. ఈ అద్భుతమైన టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ పాత్ర నటించినట్టుగా అనిపించదు. మా మూవీని రిలీజ్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.


Advertisement
Ameer LogAmeer Log teaser releaseVamsi NandipatiMadhavi Reddy Soma

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News