"చెన్నై లవ్ స్టోరీ"లో ఎలాంటి వివాదస్పద కంటెంట్‌ ఉండదు: ఎస్ కేఎన్

Entertainment
Advertisement

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి సినిమా నిర్మించడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో వినూత్నంగా ఆలోచిస్తుంటారు ఎస్ కేఎన్. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ రైజింగ్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.

మన తెలుగు జంట చెన్నైలో నివసిస్తుంటారు. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ గా మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబినేషన్ లోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం.

 ప్రస్తుతం మా సినిమా తెలుగు రిలీజ్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తమిళ్ రిలీజ్ అదే వారం చేయాలా, ఒకట్రెండు వారాలు ఆగి చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తమిళంలో కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్ కు వస్తున్నాయి.

- మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ గారి నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ గారి పేరు నామినేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి  హీరోగా పేరు తెచ్చుకుని ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ అవకాశాలు ఇస్తున్నారు కిరణ్ గారు. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ను ఈ సినిమా టైమ్ లో చూశాను. 

- సాయి రాజేష్ గారి కథల్లో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుందని మీకు తెలుసు. ఈ సినిమా కథ అనుకున్నాక, ఇంత బలమైన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని డిస్కషన్స్ చేశాం. సినిమా ప్రారంభమే హీరోయిన్ సీన్ తో మొదలవుతుంది. మేము తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియను సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఈ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ చాలా రోజులు మనకు గుర్తుంటాయి. 

- తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. బేబి సినిమాను తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఈ సినిమాలో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం. మూవీలో విషాదకరంగా ఉండదు. బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసుకుని మేము ఈ చిత్రాన్ని నిర్మించామంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు.  


కథను నమ్మి ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఇది ఎమోషన్స్ తో ఆకట్టుకోవాల్సిన కథ. ఆ ఎమోషన్స్ కోసం విజువల్ బ్యూటీ అవసరం. అందుకోసం నేచురల్ గా ఆ విజువల్స్ వచ్చేవరకు ఆగి షూటింగ్ చేశాం. వర్షం, సూర్యోదయం నేపథ్యంగా సాగే సీన్స్ కోసం సహజంగా వచ్చేలా వెయిట్ చేసి చేశాం. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, చీరాల..ఇలా పలు లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. అందుకే  షూటింగ్ డేస్ పెరిగాయి. సినిమాకు కావాల్సినంత రైట్ ఎమోషన్స్ వచ్చేలా ఔట్ పుట్ తీసుకున్నాం. ఇంకా కొన్ని తక్కువ డేస్ లో కూడా ఇదే క్వాలిటీతో సినిమా చేయొచ్చు. అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ ను నేను ఇంకా నేర్చుకునే క్రమంలో ఉన్నాను. 

- బేబి సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది. ఈ కథ విన్న వెంటనే మణిశర్మ గారు మా మూవీ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన చేసిన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. ట్యూన్ ఆకట్టుకుంటూనే లిరిక్స్ అర్థమవుతాయి. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. ప్రతి లిరిక్ అర్థమయ్యేలా పాటను ఎంజాయ్ చేయొచ్చు. కథలోని భావోద్వేగాలు తెలిసేలా మెచ్యూర్డ్ గా మ్యూజిక్ చేయడంలో తనకు తానే సాటి అని మణిశర్మ గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

- అర్జున్ రెడ్డి, యానిమల్, బేబి ..ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ఎప్పుడు వచ్చినా కొన్ని వివాదాలు వస్తుంటాయి. "చెన్నై లవ్ స్టోరీ"లో అలాంటి వివాదాస్పద కంటెంట్ ఉండదు. ఇది ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ మీద వెళ్లే కథ. 

మా "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ మా సినిమాకు టార్గెట్. వాళ్లంతా వచ్చి మా సినిమాను అఫర్డబుల్ టికెట్ రేట్స్ లో చూడాలి. టికెట్ రేట్స్ పెంచి వచ్చే కలెక్షన్స్ కన్నా, ఎక్కువమంది ఆడియెన్స్ మా సినిమాను చూస్తున్నారనేది సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం కొన్నిఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని త్వరలో అనౌన్స్ చేస్తాను.
Advertisement
SKNChennai Love Storyskn interviewKiran AbbavaramSri Gouri Priya

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News