Gandhi Memorial: గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అమెరికా 250వ..
Add ap7am to your home Screen

గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు

గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు
డాలస్, టెక్సస్: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు టెక్సస్‌లోని డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో, అమెరికాలోనే అతిపెద్దదైన గాంధీ స్మారకం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై తమ దేశభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ, అమెరికా సమాజంలో భాగమవుతూ ఇర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకాన్ని తమ నగరంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసించారు. టెక్నాలజీ, విద్య, వైద్య రంగాలలో భారతీయులు తమ ప్రతిభతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, తద్వారా అమెరికా జీడీపీ వృద్ధికి దోహదపడటం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా "స్వర స్వాతి సింగింగ్ గ్రూప్"కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు అమెరికా జాతీయ గీతంతో పాటు పలు దేశభక్తి గీతాలను ఆలపించి ఆహూతులను ఆకట్టుకున్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, "ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా 250 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం. ఈ దేశం కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. మన సంస్కృతి, విలువలను కాపాడుకుంటూనే అమెరికా సమాజంలో భాగస్వాములు కావాలి. స్వాతంత్ర్యం హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. విభేదాలను వీడి ఐక్యతతో, ద్వేషాన్ని వీడి ప్రేమతో ముందుకు సాగాలి," అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు తదితరులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నారులకు దేశభక్తి గీతాలపై శిక్షణ ఇచ్చిన స్వాతి కుప్పిలికి, సహకరించిన తల్లిదండ్రులకు, ముఖ్య అతిథులకు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
20260705fr6a49ca1457a7a.jpg
Gandhi Memorial
Dallas
USA
NRI
Prasad Thotakura

Watch Today's Deals on Amazon

More Press News