జులై 10న తెలుగులో విడుదల కానున్న పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’

Entertainment
Advertisement
మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు చేస్తుంటారు. రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ప్రఖ్యాత చిత్రం ‘ వారణాసి’ లో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం  ‘ఐ, నోబడీ’. 

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నిస్సాం బషీర్ దర్శకత్వంలో  జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతు తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అత్యంత ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. 
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఉత్కంఠభరితమైన కథ, వేగవంతమైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించనుంది.

ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు జీవితంలో అనూహ్యంగా జరిగిన సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు అతను నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానమే ‘ఐ, నోబడీ’.

భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా రూపొందింది. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు తమ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించనుండగా, దర్శకుడు నిస్సాం బషీర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండడంతో, ఈ నెల 9 న పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
Advertisement
I NobodyPrithviraj SukumaranAction ThrillerNissam BasheerParvathy Thiruvothu

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News