Harsh Roshan: ఈవీవీ సినిమా బ్యానర్‌లో హర్ష రోషన్‌ సినిమా..
Add ap7am to your home Screen

ఈవీవీ సినిమా బ్యానర్‌లో హర్ష రోషన్‌ సినిమా ప్రారంభం

ఈవీవీ సినిమా బ్యానర్‌లో హర్ష రోషన్‌ సినిమా ప్రారంభం
తెలుగు సినిమా రంగంలో ఐకానిక్, పేరెన్నికగన్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈవీవీ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తాజాగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’,  ‘అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’,  నువ్వంటే నాకిష్టం, కితకితలు  వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. 

ఇప్పుడు ఈ లెజండరీ బ్యానర్‌పై ఈవీవీ గారి తనయుడు ఆర్యన్‌ రాజేష్‌ మరో నిర్మాత ఎన్‌.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు.  నిజ జీవిత కథ ఆధారంగా  ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘కోర్ట్’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యువ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ చిత్రానికి  అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు.  నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమకథను వారు రూపొందించారు. ఈ సినిమా ఇటీవల శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.


Harsh Roshan
EVV Cinema
Aryan Rajesh
Priyanka achar

Watch Today's Deals on Amazon

More Press News