జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘రుణానుబంధం’ జూన్ 22న ప్రారంభం

Entertainment
Advertisement
ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనంతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక ‘రుణానుబంధం’. భావోద్వేగపూరిత కథనం, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే కుటుంబ నేపథ్య సరికొత్త ధారావాహిక ‘రుణానుబంధం’ జూన్ 22న ప్రారంభం. జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు.

ఈ సీరియల్ కథ ఒక ధనవంతురాలైన, ప్రతిభావంతమైన మహిళ మైనావతి(నీలిమ) ఒక వర్షపు రాత్రి తనకు పుట్టిన బిడ్డను వదిలేస్తుంది. ఆ బిడ్డ ధరణి(అనగ) పేరుతో తోలుబొమ్మలాట కళాకారుడు అప్పన్న(ప్రభాకర్) దగ్గర పెరుగుతుంది. తోలుబొమ్మలాట ద్వారా సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యవంతురాలైన ధరణి ఒకరోజు తన గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. 

ధరణిపై పగతీర్చుకునేందుకు మైనావతి కూతుళ్లు సంజన(నేహాల్), నయన (దివ్య) అనేక కుట్రలు పన్నుతారు. అందులో భాగంగా గ్రామాధినేత, మైనావతి సోదరుడు ధర్మతేజ(సతీష్)తో బలవంతంగా ధరణి వివాహం జరిపించి ఆమెను ఇంట్లోనే బంధిస్తారు. ఆ ఇంట్లో ధరణి ఎదుర్కొనే బాధలు, కుట్రలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ధరణి జన్మరహస్యం ఎలా బయటపడుతుంది? ధరణి తన కూతురేనని మైనావతి గుర్తిస్తుందా? ద్వేషాన్ని క్షమాగుణం జయిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జీ తెలుగు వేదికగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే ‘రుణానుబంధం’ సీరియల్ను మీరూ తప్పకుండా చూసేయండి!

ద్రోహం, ప్రతీకారం, ద్వేషం, క్షమాగుణం.. మధ్య సాగే ఆసక్తికరమైన ధారావాహిక రుణానుబంధం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో!
Advertisement
RunanubandhamNew Daily SerialZee Telugu

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News