zee telugu: జీ తెలుగు వీకెండ్‌ హంగామా: డ్రామా జూనియర్స్..
Add ap7am to your home Screen

జీ తెలుగు వీకెండ్‌ హంగామా: డ్రామా జూనియర్స్ సీజన్ 9 & చాంపియన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

జీ తెలుగు వీకెండ్‌ హంగామా: డ్రామా జూనియర్స్ సీజన్ 9 & చాంపియన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

హైదరాబాద్, మే 20, 2026: సరికొత్త కార్యక్రమాలు, సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు, ఈ వీకెండ్‌ మరిన్ని కార్యక్రమాలతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న డ్రామా జూనియర్స్ రియాలిటీ షో మరో సీజన్తో వచ్చేస్తోంది. ఈ వారాంతంలో డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్తో పాటు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను అలరించనుంది మీ జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 మే 21 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, మే 23 నుంచి ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

గత ఎనిమిది సీజన్లలో యువ నటీనటులను తెరపైకి తీసుకువచ్చి, వారి జీవితాలను మార్చిన డ్రామా జూనియర్స్, తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిల్డ్రన్స్ రియాలిటీ షోగా నిలిచింది. భావోద్వేగాలు, అద్భుతమైన ప్రదర్శనలు, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ షో, అనేక మంది యువ నటులను సినిమా, టెలివిజన్ రంగాలకు అందించింది. ఈ సీజన్‌కు ప్రముఖ యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరించనుండగా, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైనమిక్ లేడీ రోజా, హీరో శ్రీకాంత్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆకట్టుకునే చిన్నారుల ప్రదర్శనలు, ఆసక్తికరమైన సంభాషణలతో ప్రేక్షకులను మెప్పించేందుకు డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఘనంగా ప్రారంభం కాబోతోంది. 

ఈ వీకెండ్ వినోదానికి అదనంగా, రైజింగ్ స్టార్ రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం చేయనుంది జీ తెలుగు. యాక్షన్, భావోద్వేగాలు, మాస్ అప్పీల్ నిండిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్, ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్తో ఈ వారాంతాన్ని వినోదంతో నింపేందుకు వచ్చేస్తోంది మీ జీ తెలుగు!

అలరించే ప్రదర్శనలు, అసలైన సినిమాటిక్ వినోదాన్ని పొందాలంటే.. ఈ వారాంతంలో జీ తెలుగు తప్పక చూడండి!

zee telugu
drama juniors

Watch Today's Deals on Amazon

More Press News