జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఆట గ్రాండ్ ఫినాలే... ఈ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు!

Entertainment
Advertisement

హైదరాబాద్, 29 ఏప్రిల్ 2026: తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్నమైన రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు, ఇప్పుడు మరో సంచలన ముగింపు వేడుకకు సిద్ధమైంది. అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స్ రియాలిటీ షో జీ తెలుగు 'ఆట' గ్రాండ్ ఫినాలే ఈ వారాంతంలో అట్టహాసంగా జరగనుంది. మే 2, 3వ తేదీల్లో రాత్రి 9 గంటలకు రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ వేడుక, బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

 

నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే మరింత అద్భుతంగా సాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ స్టార్ కపుల్ జీవిత - రాజశేఖర్ సందడి చేయనున్నారు. అలాగే మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఫైనలిస్టులను ఉత్సాహపరిచేందుకు అతిథిగా విచ్చేయనున్నారు. యాంకర్ సుధీర్ కామెడీ టైమింగ్, సమీరా భరద్వాజ్ సంగీత విభావరి ఈ ముగింపు వేడుకను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

 

ఈ రెండు రోజుల వేడుకలో అనేక ఆసక్తికరమైన మరియు భావోద్వేగపూరితమైన ఘట్టాలు చోటుచేసుకోబోతున్నాయి. నటుడు రాజశేఖర్, రాధిక శరత్ కుమార్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా రాజశేఖర్ ముద్దుపేరు 'బన్ బాబు' గురించి జరిగిన చర్చ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఐకానిక్ మేనరిజంతో 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ అతిథులందరూ కలిసి చేసిన డాన్స్ స్టేజ్ మీద ప్రకంపనలు సృష్టిస్తుంది.

 

కేవలం వినోదమే కాకుండా, మనసును హత్తుకునే సందర్భాలు కూడా ఈ ఫినాలే ఎపిసోడ్లో అందరినీ ఆకట్టుకోనున్నాయి. మెగా హీరో సాయి దుర్గ తేజ్ జీవితంలో ఎదురైన ప్రమాదం, ఆ తర్వాత కోలుకున్న తీరు గురించి పంచుకున్న విషయాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. నిహారిక తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడున్న వారందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి.

 

సంబరాలు ఒకవైపు సాగుతుండగానే, టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఫైనల్ ఎపిసోడ్‌లో ఫైనలిస్టులు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో పోటీ పడనున్నారు. ముఖ్యంగా పుష్ప, గౌరవ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జడ్జీలను సైతం ఆశ్చర్యపరిచాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో చివరికి 'ఆట' విజేతగా ఎవరు నిలిచారు? జీ తెలుగు ఆట ట్రోఫీని ఎవరు కైవసం చేసుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే మే 2, 3 తేదీల్లో జీ తెలుగులో ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే చూడాల్సిందే.

 

జీ తెలుగు ‘ఆట’టైటిల్ విజేత ఎవరు?.. తెలుసుకోవాలంటే ఈ శని, ఆదివారల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేని మిస్ కాకండి!

Advertisement
Zee TeluguDance RealityGrand Finale

More Press News

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46
..More Press News