"చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

"చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్  భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు.సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంఛ్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు , తను అనుకొన్నవి ఎలా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా, ఇన్స్ పైరింగ్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాయివెంకట్. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో సమ్మర్ రిలీజ్ కు రాబోతోందీ చిత్రం. త్వరలోనే "చిరంజీవి"  సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు
Chiranjeevi
Chiranjeevi movie
Nagababu
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News